ఆగని ఇసుక దందా . అధికారులు పట్టించుకోరు

Mar 26, 2024 - 19:53
 0  15
ఆగని ఇసుక దందా . అధికారులు పట్టించుకోరు
ఆగని ఇసుక దందా . అధికారులు పట్టించుకోరు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి .ఇసుక తరలింపు ను అడ్డుకున్న గ్రామస్తులు అయినా అగని ఇసుక దందా... పోలీసుల నామమాత్రపు తనిఖీ లు... మండల పరిధిలో ఏపూర్ గ్రామంలో గత 15రోజులు గా ఇసుక దందా కొనసాగుతుంది. కొద్ది రోజులు పగలు ట్రాక్టర్ లద్వారా తరలించగా స్థానికుల వత్తిడి మేరకు పోలీసులు నామ మాత్రపు చర్యలు కేసులు చేసి వదిలేశారు. తర్వాత ఏపూర్ బ్రిడ్జి వద్ద ట్రాక్టర్ లు పోకుండా పోలీసులు గాతులు తవ్వించారు.ఇక పగలు మానేసి రాత్రి వేళల్లో ఏపూర్ ఏటి నుండి ఇసుక తరలింపు లింగంపల్లి మీదుగా తరలిస్తున్నారు. స్థానికులు పోలీసుల కు ఎంత సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులే రంగం లోకి దిగి సోమవారం రాత్రి ఏటిలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ల ను అడ్డుకున్నారు. ఒక సందర్భం లో ఇసుక తరలింపు వారు గ్రామస్తుల పై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏపుర్ గ్రామస్తుల నుండి కూలీల కారణంగా బయటికి సమాచారం పోతుందని లింగంపల్లి కూలీలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళ వారం సూర్యాపేట rdo వేణు మాధవ్ రావు ఆత్మకూర్ రెవిన్యూ కార్యాలయం కు వచ్చి తహసిల్దార్ కు ఇసుక తరలింపు పై చర్యలు తీసుకోవాలని సీరియస్ గా చెప్పినా ఇసుక తరలింపు ఆగడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఇసుక తరలింపు లో అధికార పార్టీ కి చెందిన ట్రాక్టర్ లు ఉండడం తో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉందని గ్రామస్తులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నప్పటికీ ఇసుక దందా ను అరికట్టలేకపోవడం తో అధికారుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..