వరి పైరును పరిశీలిస్తున్న ఏఈఓ శివకుమార్.

Mar 15, 2024 - 21:17
 0  6
వరి పైరును పరిశీలిస్తున్న ఏఈఓ శివకుమార్.

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ *నకిలీ వరి విత్తనాలతో కష్టపడుతున్న రైతు* ఆత్మకూర్ ఎస్... మండల పరిధిలోని కందగట్ల గ్రామానికి చెందిన ఏర్పుల సైదులు అనే రైతు పొలంలో నకిలీ వరి విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతు ఆరోపించాడు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సూర్యాపేటకు చెందిన సాయి భవ్య విత్తనాలు షాపులో సన్న రకం చింట్లు వరి విత్తనాలను కొనుగోలు చేసి ఐదు ఎకరాల్లో సాగు చేశామని తెలిపారు. సన్న రకాల వరి ధాన్యంలో ఆర్ఎన్ఆర్ దొడ్డు రకం వరి విత్తనాలు కలవడంతో విత్తనాలు ముందుగా కోతకు వచ్చాయని సన్న రకాలు ఆలస్యంగా వస్తున్నాయని దీని కారణంగా దిగుబడి అంతరాయం ఏర్పడుతుందని రైతు వాపోయారు. కల్తీ విత్తనాల ను అమ్మిన షాపు యజమానికి సమాచారం ఇవ్వగా పరిశీలించి కంపెనీకి సమాచారం ఇస్తామని తర్వాత ఫోన్ కూడా చేయడం లేదంటూ ఆరోపించాడు ఈ విషయమై మండల వ్యవసాయ శాఖ కు ఫిర్యాదు చేయగా వారిపై రెండు పరిశీలించారని వాస్తవంగా సన్న రకాల్లో దొడ్డు రకం విత్తనాలు కలిసినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. మిగిలి విత్తనాలను విక్రయించిన సాయి భవ్య ఎరువుల షాప్ పై చర్యలు తీసుకోనీ నష్టపరిహారం ఇప్పించాలనిరైతు సైదులు కోరారు. *Aeo వివరణ....* కందగట్ల కు చెందిన రైతు సైదులు వేసిన వరి సాగులో కల్తీ విత్తనాలు వచ్చిన మాట వాస్తవమేనని కులాన్ని పరిశీలించి వివరాలను ఉన్నతాధికారులకు అందజేసినట్లు ఏ ఈ ఓ రాచకొండ శివ కుమార్ వివరణ ఇచ్చారు.