వరి పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

Nov 15, 2025 - 19:37
 0  2
వరి పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

 చిన్నంబావి మండలం 15నవంబర్ 2025తెలంగాణ వార్త : చిన్నంబావి మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పర్యటించారు.అయ్యవారిపల్లి,వెల్టూరు,చిన్నమారు, పెద్దమరూర్,కొప్పునూరు గ్రామాల,వర్షాల ప్రభావం వల్ల మరియు బ్లాస్టింగ్ వైరస్ తెగులు వచ్చిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడడం జరిగింది.రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అపార నష్టం జరిగిన రైతులను గుర్తించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.ఈ సందర్భంగా వారితో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, ఉమ్మడి మండలాల ఇంచార్జ్ గోవిందు శ్రీధర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఆనందు,మాజీ ఎంపీటీసీ తగరం లక్ష్మీ కుర్మయ్య, సీనియర్ నాయకులు వడ్డేమాన్ రామకృష్ణ,ఆటో కుర్మయ్య,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333