వనపర్తి జిల్లాకు కొత్త ఎస్పీగా సునీత బాధ్యతలు
చిన్నంబావి21నవంబర్ 2025 తెలంగాణ వార్త : వనపర్తి: రాష్ట్రంలో జరిగిన ఐపీఎస్ బదిలీలలో భాగంగా వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా సునీత నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సునీత శుక్రవారం వనపర్తి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, పౌరుల భద్రతకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. నేర నియంత్రణ, మహిళల భద్రత, యువతలో చట్టం పట్ల అవగాహన పెంపు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తానని పేర్కొన్నారు.అధికారులతో జరిగిన సమీక్షలో ఆమె పోలీసు విభాగంలోని సిబ్బంది సహకారంతో నిష్పాక్షికంగా సేవలందిస్తానని స్పష్టం చేశారు. ఆమె నియామకంపై జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.