సమస్యల సాధనకై  కదిలి వచ్చిన కార్మికులకు, స్పందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు 

Nov 22, 2025 - 19:31
 0  7
సమస్యల సాధనకై  కదిలి వచ్చిన కార్మికులకు, స్పందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు 

రామన్నపేట 22 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించి,చేనేత రుణమాఫి,నేతన్న భరోసా వెంటనే అమలు చెయ్యాలని,చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుతో సమస్యల సాధనకై కదలి వచ్చిన చేనేత కార్మికులకు,రాష్ట్ర జిల్లా మండల కమిటీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేస్తుందని.చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వనం ఉపేందర్  తెలిపారు.ఆయన రామన్నపేట మండలంలో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ..ప్రభుత్వం చేనేత కార్మికులకు చేనేత రుణమాఫి,నేతన్న భరోసా ప్రకటించి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న అమలు చేయడంలో  కాలయాపాన  చేస్తుండటంతో,రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు,రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికూమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి గార్లు కార్మికులతో కలసి చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావుని మరియు కమిషనర్ శైలజ రామయ్యకి అనేక సార్లు సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగిందని తెలిపారు. ఫలితం కనిపించక పోవడం,అమలులో జాప్యం చేస్తుండటంతో,చేనేత సమస్యలు పరిష్కరించి చేనేత రుణమాపి,నేతన్న భరోసా వెంటనే అమలు చెయ్యాలని,జాప్యం లేకుండా నేతన్న బీమా,ఆర్డి 2అకౌట్లలో  ప్రభుత్వం డబ్బులు జమచేయ్యాలని  కోరుతూ,కమిషనర్  కార్యాలయం ముందు ధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగిదని, పిలుపునందుకొని  సమస్యల సాధనకై కార్మికులు కదలిరావడతో స్పందించిన ప్రభుత్వం,చేనేత సమస్యలతో పాటు రుణమాఫి,నేతన్న భరోసా అమలుకు  వెంటనే చర్యలు చేపట్టిందని,ఇది చేనేత కార్మిక సంఘం పోరాట ఫలితమేనని పేర్కొన్నారు. ఎప్పటికైన ప్రభుత్వం చేనేత సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333