లగచర్ల ఘటనలో పోలీసుల తీరుపై మండిపడ్డ హైకోర్టు

Nov 26, 2024 - 19:33
 0  3
లగచర్ల ఘటనలో పోలీసుల తీరుపై మండిపడ్డ హైకోర్టు

- నకల్ మార్నే కో భీ.. అకల్ కీ జరూరత్ హై

ఏ చట్టం ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారో చెప్పండని పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు ఫిర్యాదులోని అంశం ఒకటేనని, ఫిర్యాదుదారు మారిన ప్రతిసారీ కొత్త ఎఫ్ఐఆర్ పెట్టడం ఎలా సమర్థనీయమో చెప్పాలని నిలదీసింది. తహసీల్దార్, ఆర్డీవో, డీఎస్పీ, డీసీఆర్బీ.. ఇలా ఫిర్యాదు చేశారంటూ సంతకం మార్చారు. కానీ ఫిర్యాదు రాసిన రైటర్ సహా తేదీలు, నిందితుల పేర్లు మాత్రం ఒకేలా ఉన్నాయి. 

డీఎస్పీ, తహసీల్దార్లు సొంత ఫిర్యాదును కూడా రాయలేకపోయారా? విషయమంతా ఒకేలా రాసిన రైటర్.. ఫిర్యాదుదారుల నుంచి సంతకాలు మాత్రమే తీసుకున్నారు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

ఫిర్యాదును మార్చకుండా సంతకాలు తీసుకోవడంపై.. నకల్ మార్నే కో భీ.. అకల్ కీ జరూరత్ హై (కాపీ కొట్టడానికి కూడా కొంత తెలివి అవసరం) అని వ్యాఖ్యానించారు. అనంతరం తీర్పును రిజర్వు చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333