అవయవ దానం మరో జీవికి ప్రాణదానం

Aug 4, 2024 - 22:14
 0  8
అవయవ దానం మరో జీవికి ప్రాణదానం

బాలసదనం సూపరిండెంట్ సుమతి 

ఆగస్టు 4 ములుగు తెలంగాణ వార్త:-


 అవయవ దానం ప్రాణదానంతో సమానమని, జీవి మరణించిన అవయవ దానంతో మరో జీవికి ప్రాణ దానమని బాలసదనం సూపరిండెంట్ సుమతి అన్నారు,
ఆదివారం జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా బాలసదనం నందు జెన్ జాగృత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా బాలసదనములో ఉన్న పిల్లలకు అవయవ దాన ఆవష్యకతని బాలసదనం సూపరింటెండెంట్ సుమతి వివరించారు, ఒక జీవి మరణించిన అవయవ దానంతో మరొక జీవి బ్రతికే ఉంటుందని తెలిపారు, భవిష్యత్తులో అవయవాలు దొరకడం చాలా ఇబ్బంది కరంగా ఉంటుందని, రక్త దానం తర్వాత అవయవ దానం కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందని ఆమె అన్నారు, ప్రతి ఒక్కరు అవయవ దానం చేయడం ద్వారా మన మరణంతరం మనం చేసే అవయవ దానం ద్వారా ప్రపంచాన్ని మరల చూసే అవకాశం ఉంటుందని నేను కూడా అవయవ దానం చేయడానికి సిద్ధంగా ఉన్నానని సుమతి తెలిపారు, ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ రజిని, బాలసదనం కౌన్సిలర్ రాణి, CHL కేసు వర్కర్ నాగమణి మరియు హోమ్ మదర్ సౌజన్య, బాలసదనం పిల్లలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333