రోమన్ కేథలిక్ చర్చి మతాధికారి పోప్ ఫ్రాన్సిస్ మృతి క్రైస్తవ లోకానికి తీరనిలోటు
బిషప్ దుర్గం ప్రభాకర్
సంతాపం తెలిపిన తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ నాయకులు
సోమవారం 21 ఏప్రిల్ : సూర్యాపేట పట్టణ కేంద్రం శాంతినగర్ బిషప్ దుర్గం ప్రభాకర్ నివాసం లో మాట్లాడుతూ పోప్ ప్రాన్సిస్స్ మరణం క్రైస్తవ లోకానికి తీరని లోటని సంతాపం తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ పోప్ రోమ్ బిషప్, రోమన్ కేథలిక్ చర్చి మతాధికారి రోమన్ కేథలిక్ చర్చి మతాధికారి వాటికన్ నగరపు అధ్యక్షుడు, పోప్ ఫ్రాన్సిస్ 2025 ఏప్రిల్ 21న, ఏలికల సోమవారం, 88 సంవత్సరాల వయసులో మరణించారనీ, ఆయన గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నడని అతనికి వచ్చిన శ్వాసకోశ సమస్యలు మరియు పీరియా, శ్వాసకోశ సంక్షోభం మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో సంబంధం కలిగి ఉందనీ, పోప్ ఫ్రాన్సిస్ 2013 నుండి 2025 వరకు పోప్‌గా పనిచేశారనీ, పోప్ ఫ్రాన్సిస్, అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో, 1936 డిసెంబర్ 17 న అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో జన్మించారనీ,పోప్ గా 2013 మార్చి 13 న అతను 266 వ పోప్‌గా ఎన్నికయ్యాడు
పోప్ ఫ్రాన్సిస్ తన పాపసీ మొత్తం, సామాజిక న్యాయం, పేద ప్రజల పట్ల నిబద్ధతతో పాటు కాథలిక్ చర్చిని సంస్కరించడానికి చేసిన ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడనీ అన్నారు.