ప్రధానమంత్రి గా మోడీ ని గెలిపిద్దాం 

May 9, 2024 - 20:59
 0  16
ప్రధానమంత్రి గా మోడీ ని గెలిపిద్దాం 
ప్రధానమంత్రి గా మోడీ ని గెలిపిద్దాం 
ప్రధానమంత్రి గా మోడీ ని గెలిపిద్దాం 

బీజేపీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ EVM లో 3 వ నెంబర్ పై బటన్ నొక్కి 3 వ సారి ప్రధానమంత్రి గా మోడీ ని గెలిపిద్దాం 

బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు S. రామచంద్రారెడ్డి

జోగులాంబ గద్వాల 9 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- రాజోలి. మండలం పచ్చర్ల గ్రామంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట్ల వీరేశ్ రెడ్డి  ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి  విచ్చేసి ఆయన మాట్లాడుతూ  నాగర్ కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్  EVM లో మూడో నెంబర్ పై బటన్ నొక్కి  నరేంద్ర మోడీ ని ప్రధానిగా 3 వ సారి అయ్యే దాంట్లో మన పాత్ర ఉండాలని, గత పది సంవత్సరాలుగా దశాబ్దాల కాలాల నుండి  కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధి  బిజెపి చేసిందని, అదేవిధంగా దేశ భద్రత విషయంలో రాజీ లేని పోరాటం చేస్తూ ప్రపంచ దేశాలు మొత్తం మన దేశం అభివృద్ధి గురించి  చర్చిస్తున్నారని , భద్రతతో పాటు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు విషయంలో , భారత్ శరవేగంగా ముందుకు వెళ్తుందని , ఉపాధి కల్పనలో భాగంగా 25 కోట్ల మందికి నూతనంగా  ప్రభుత్వ & ప్రైవేటు సెక్టార్లలో  నరేంద్ర మోడీ  కృషి వల్ల ఉద్యోగాలు కల్పించారని, ప్రస్తుతం ప్రపంచంలో 5 వ అతిపెద్ద అభివృద్ధి చెందిన దేశమని రాబోయే 5 సంవత్సరాలలో మూడవ అతిపెద్ద దేశంగా అవతరిస్తుందని కావున మనమంతా  కమలం గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని అని అన్నారు...  

 ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు సంజీవరెడ్డి, గ్రామ బూత్ 134,135,136, అధ్యక్షులు, రామాంజనేయులు, దస్తగిరి, అశోక్ రెడ్డి, గ్రామ నాయకులు గోవర్ధన్, వేణు, మధు, పరుశరాముడు, రవి, నాగరాజు,మహేష్ , విష్ణు, శేఖర్, వినోద్, మైభు, రామాంజనేయులు, భీమేశ్, వీరేంద్ర, దస్తగిరి,  మరియు యువకులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333