రైతు సాగు న్యాయ యాత్ర సమావేశం 

Nov 13, 2025 - 19:34
 0  5
రైతు సాగు న్యాయ యాత్ర సమావేశం 

అడ్డగూడూరు 12 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులతో ప్రత్యేక రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశాన్ని లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో “రైతులకు చట్టాలను చుట్టాలు చేయడం”అనే లక్ష్యంతో నిర్వహించారు.ఈ సమావేశంలో పాల్గొన్నారు.భూమి సునీల్,రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు మహేష్ (రైతు  కమిషన్ అధికారి)  లీఫ్స్ సంస్థ ప్రతినిధులు న్యాయవాదులు జీవన్,అభిలాష్, మల్లేశ్,ప్రవీణ్,ఇరుగు రవి,సందీపు,

   ఈ సందర్భంగా భూమి సునీల్ రైతులతో 6 కీలక అంశాలపై చర్చించారు.1భూమి సమస్యలు 2    విత్తనం 3 సాగునీటి సమస్యలు 4 పంట రుణాలు 5    పంటల బీమా 6    మార్కెట్ సంబంధిత సమస్యలు వాటిపై ఉన్న చట్టపరమైన వివరాలను సూటిగా,స్పష్టంగా అందించారు.రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల వ్యవసాయ అధికారి,మండల రెవెన్యూ అధికారి  తాసిల్దార్ శేషగిరిరావు,సీనియర్ అసిస్టెంట్ నాగేష్,మండల వ్యవసాయ అధికారి ఏవో పాండురంగ చారి, ఏఈఓలు   దయాకర్,నవనీత అధికారులు  మరియు మండలంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333