మండిపోతున్న కూరగాయల ధరలు

Nov 13, 2025 - 19:33
 0  0
మండిపోతున్న కూరగాయల ధరలు

సెంచరీకి చేరువలో నిత్య వంటకాలలో ఉపయోగించే కూరగాయల ధరలు

చిన్నంబావి మండలం13నవంబర్2025తెలంగాణ వార్త : వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో ప్రతి వారం జరిగే సంత కూరగాయల ధరలు వార వారానికి పెరుగుతుండడం వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతోంది నగరాలలోనే కాకుండా గ్రామాలలో కూడా ఈ విధంగా రేట్లు పెరగడం ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం.ప్రస్తుత మార్కెట్ పరిస్థితులప్రకారం,చిన్నంబావి బహిరంగ మార్కెట్లలో కొన్ని ముఖ్యమైన కూరగాయల ధరలు (కిలోకు) ఈ విధంగా కూరగాయల ధరలు:- 
టమాటాలు: ₹30 నుండి ₹50 వరకుఉల్లిగడ్డలు: ₹30 నుండి ₹50 వరకు
వంకాయలు: ₹60 నుండి ₹100 వరకుపచ్చిమిర్చి: ₹50 నుండి ₹70 వరకు
బీరకాయలు/కాకరకాయలు: ₹50 నుండి ₹80 వరకుక్యారెట్: ₹60 నుండి ₹100 వరకుబీన్స్: ₹70 నుండి ₹80 వరకుఆకుకూరలు: కట్టకు ₹20 లేదా అంతకంటే ఎక్కువ.ఈ విధంగా పెరగడానికి గల ప్రధాన కారణలు చాలానే ఉన్నాయి.అందులో ముఖ్యంగా ఇటీవల కురిసిన భారీవర్షాలు (తుఫానులు) లేదా కొన్ని ప్రాంతాలలో ఉన్న వర్షాభావ పరిస్థితులు కారణంగా పంట దిగుబడి బాగా తగ్గడం.మార్కెట్‌కు కూరగాయల సరకు తక్కువగా వస్తుండడం వల్ల డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం. అలాగే కార్తీకమాసం ఇతర పండగల కారణంగా శాకాహారం వినియోగం పెరగడంతో డిమాండ్ పెరిగి ధరలుపెరుగుతున్నాయి.ఏదేమైనా ఈ కూరగాయల ధరల వల్ల సామాన్య ప్రజలకు కూరగాయలు కొనాలి అంటే అందని ద్రాక్ష కోసం ఆరాటపడుతున్నట్లు ఉంది.అయితే సాధారణంగా,కొత్త పంటలు మార్కెట్‌కు వచ్చిన తర్వాత లేదా వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ధరలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333