రైతులందరికీ రుణమాఫీ చేయాలి.
నాగారం ఆగస్టు 29 తెలంగాణ వార్త:- నాగారం :రైతులందరికీ బేశేరత్తుగా రుణమాఫీ చేయాలని ఆగస్టు 15 వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ ఆగస్టు చివరి వరకు కూడా 50 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదనిసిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం అన్నారు. గురువారం సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ లో భాగంగా నాగారం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూముఖ్యమంత్రి మంత్రుల ప్రకటనలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయని అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క రైతుకు 2.లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబం ఆధారంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఈ మాటలు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేదనిఆరోపించారు. మూడు విడతలుగా చేస్తామని ఈ మూడో విడతలో కూడా 2 లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ చేయలేదనిఅన్నారు. బ్యాంకర్లు కూడా రైతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనిఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు బ్యాంకుల ముందు క్యూ లైన్ లో నిలబడాల్సిన వస్తుందని అన్నారు.ఈ విధానాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, తమకు రుణమాఫీ అవుతుందో లేదో అని ఆందోళన పడుతున్నారనిఅన్నారు. వర్షాకాలం పంటలకు కూడా బ్యాంకర్లు రుణాలు ఇవ్వలేదని దీనితో ఖరీఫ్ పంట పెట్టుబడికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆలోచించిరైతులకు చేయాలని కోరారు. రోజుకో మాట మాట్లాడి రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా రెండు లక్షల రుణమాఫీకి కట్టుబడి వెంటనే రైతుల ఖాతాలో వెయ్యాలని, లేని పక్షంలో రైతులను కలుపుకొని పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులుకడెం లింగయ్య,సిపిఎం మండల కార్యదర్శికడెం కుమార్,మండల కమిటీ సభ్యులుకండె బిక్షం,ఎల్లమ్మ,మల్లమ్మ,వెంకటమ్మతదితరులు పాల్గొన్నారు.