ఇంటింటికి టి బి సర్వేలు .

టి బి నోడల్ అధికారి జయప్రకాశ్ .

Sep 28, 2024 - 16:58
Sep 28, 2024 - 20:12
 0  8
ఇంటింటికి టి బి సర్వేలు .
ఇంటింటికి టి బి సర్వేలు .

జోగుళాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప ఆదేశాల మేరకు, జిల్లా క్షయ వ్యాధి నివారణ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు సూచనల మేరకు,రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు సారథ్యం లో రాజోలి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది టిబి సర్వే లు చేస్తున్నారని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి నోడల్ పర్సన్ జయప్రకాశ్ తెలిపారు. గత వారం రోజులుగా దగ్గు, జ్వరము, ఆయాసము,బరువు తగ్గడం, ఆకలి మందగించటం తదితర లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తించడానికి టిబి సర్వేలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మత్తు పానీయాలు సేవించేవారు,, పొగ త్రాగేవారు, రైస్ మిల్లు లో పనిచేసేవారు, పత్తి పొలాలలో పనిచేసే కూలీలు, పిండిగిర్నీ దగ్గర పనిచేసే వారు, కారం పొడి మిషన్ దగ్గర పనిచేసే వారు తప్పకుండా గళ్ళ పరీక్ష లను చేయించుకోవాలని ఆయన చెప్పారు.మా సిబ్బంది ఇంటింటికీ తిరిగి క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వారి వివరాలు నమోదు చేస్తున్నారని వారికి మీ వివరాలు చెప్పాలని ఆయన అన్నారు. ప్రతీ రోజూ గళ్ళ డబ్బాలను సేకరించి వారి వివరాలు టిబి ల్యాబ్ రిజిష్టర్ లో నమోదు చేసి టి హబ్ వాహనం లో జిల్లా కేంద్రము నకు తరలించడం జరుగుతుందని ఆయన చెప్పారు.జిల్లా కేంద్రము లో ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షలు నిర్వహించిన తరువాత గళ్ళ పరీక్ష లో గానీ, ఎక్స్ రే లో గానీ క్షయ వ్యాధి నిర్ధారణ అయితే వారికి 6నెలల వరకు ఉచితంగా టిబి మందులు ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. అందుకుగాను టిబి రోగి యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లు జీరాక్స్ కాపీ లు ఇవ్వాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల 500 రూపాయలు చొప్పున 6నెలలకు 3 వేల రూపాయలు టిబి రోగి యొక్కబ్యాంక్ ఖాతా నెంబరు లో జమ చేస్తారని ఆయన వివరించారు. టిబి మందులు క్రమం తప్పకుండా వాడాలని, మందుల తో పాటుగా పౌష్టిక ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు, టిబి రోగి యొక్క అన్నీ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన చెప్పారు. క్షయ వ్యాధి వచ్చినంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదని టిబి మందులు క్రమం తప్పకుండా వాడితే త్వరగా నయం అవుతుందని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి నోడల్ అధికారి జయప్రకాశ్ తెలియజేశారు

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State