రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు 18 మంది క్రీడాకారులు ఎంపిక..!

Jan 26, 2025 - 21:44
 0  4
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు 18 మంది క్రీడాకారులు ఎంపిక..!

జోగులాంబ గద్వాల 26 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.

గద్వాల:- జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం లో ఆదివారం సీనియర్ కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సెలక్షన్స్ కి గద్వాల్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి దాదాపు 50 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. వీరిలో నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 18మంది క్రీడాకారులను సెలెక్ట్ చేశారు. వీరికి క్యాంపు నిర్వహించి త్వరలో ఆదిలాబాద్ లో ఫిబ్రవరి 4 నుండి 7 వరకు జరగబోయే రాష్ట్రస్తాయి సీనియర్ పురుషుల కబడ్డీ టోర్నమెంట్ కీ పంపించడం జరుగుతుందని జోగులాంబ గద్వాల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు డి.కే స్నిగ్ధ రెడ్డి  మరియు జనరల్ సెక్రటరీ నరసింహ తెలిపారు.ఈ కార్యక్రమంలో  జిల్లా కబడ్డీ అసోసియేషన్  చైర్మన్  అబ్రహం బండల వెంకట్రములు,మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మావతి  ట్రెజరర్ చందు ఆర్గనైజింగ్ సెక్రెటరీ రవి, లిగల్ అడ్వైజర్ తరుణ్, కరెంట్ నరసింహ,పోలీసు వెంకటేష్, నాగేష్, పీడీ స్రవంతి, పీడీ జగదీష్ రాజేంద్ర తిరుపతి. కె.రాజశేఖర్,శివ. వెంకటన్న ,సర్వేస్ రెడ్డి మరియు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333