రాజోలికి జూనియర్ కళాశాల కోసం వినతి

జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2024 తెలంగాణ వార్తా:- అలంపూర్:ఎమ్మెల్యే విజయుడు రాజోలి మండలం మాన్‌దొడ్డి పర్యటనలో TASS కమిటీ సభ్యులు జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లలేక పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేస్తున్నారని, ఈ సమస్య పరిష్కారానికి కళాశాల ఏర్పాటు అవసరమని సభ్యులు తెలిపారు. కమిటీ సభ్యులు, CRPF సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.