ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు జరగాలి

Apr 1, 2024 - 17:43
 0  12
ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు జరగాలి

జోగులాంబ గద్వాల 1 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు మరియు ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా  ప్రజలకు అవగాహన కల్పించాలి డాక్టర్ రాజు అన్నారు. సోమవారం గద్వాల మండలంలోని సోమవారం జమ్మిచేడు గ్రామ హెచ్ డబ్ల్యు సి లో ఉప్పేరు వైద్యాధికారి,డాక్టర్ రాజు ఆధ్వర్యంలో నెలసరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా వడదెబ్బల గురించి ప్రతి గ్రామాల్లో అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది.వడదెబ్బ తగిలినట్లైతే వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్ అందిస్తూ,సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు జరగాలని సిబ్బందికి సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ రవిచందర్,సూపర్ వైసర్ విజయ్ భాస్కర్,వారి వైద్య సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333