రూ 2.50 లక్షల విలువైన ఎద్దులు, ఆవుల చోరీ

జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-గద్వాల గుర్తు తెలియని వ్యక్తులు రూ 2.50 లక్షల విలువైన ఆవులు ఎద్దులను చోరీచేసిన సంఘటన గద్వాల మున్సిపాలిటి కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గద్వాల మున్సిపాలిటి కేంద్రంలోని దౌదర్పల్లి ఏడవ వార్డుకు చెందిన దుబ్బ శేషప్ప కుమారుడు రాజీ అనే రైతుకు సంబంధించిన రూ 2.50 లక్షల విలువ చేసే రెండు ఆవులు,రెండు ఎద్దులు కొండపల్లి రోడ్డు లోని రంగారెడ్డి మిల్లు సమీపంలో కట్టేసి ఉంచాడు. తెల్లవారుజామున ఎవరు లేని సమయంలో ఆ మూగజీవాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. కౌగిలి పండ్లతో జీవనం గడిపే ఆ కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.