యువత విద్యార్థులు డ్రగ్స్ గంజాయి లాంటి వాటికి అలవాటు పడకండి ఎస్సై శ్రీకాంత్ గౌడ్

Jun 26, 2025 - 21:06
Jun 27, 2025 - 15:29
 0  2
యువత విద్యార్థులు డ్రగ్స్ గంజాయి లాంటి వాటికి అలవాటు పడకండి ఎస్సై శ్రీకాంత్ గౌడ్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ యువత విద్యార్థులు డ్రగ్స్ గంజాయి లాంటి వాటికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఐ బి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలో మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యువకులు ఫ్యాషన్ మోజులో మత్తు పదార్థాలకు అలవాటై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. విద్యార్థుల మీద , యువకుల మీద తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఆయన కోరారు. యువకులు మద్యానికి బానిసై రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ తమ జీవితాలను మధ్యలోనే ముగించి కన్నవారి కలలను తుడిచివేస్తున్నారని అన్నారు. ఫ్యాషన్ మొదలు బైకులపై తిరుగుతూ మార్గదర్వేలు సేవిస్తూ తమ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని ఆయన కోరారు. అసాంఘిక కార్యక్రమాలపై మాదకద్రవేల సరఫరా పై ఎలాంటి సమాచారం ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి దారాసింగ్ మండల వైద్యాధికారి మమత, ఎంపీడీవో హసిం, ఐసిడిఎస్ సూపర్వైజర్ అన్నపూర్ణ, నిమ్మికల్ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ గోనెగంటి వెంకటేశ్వర్లు పంచాయతీ కార్యదర్శి సుధాకర్ పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.