యువకుని మరణం తీరని లోటు?

Nov 17, 2025 - 20:08
 0  295
యువకుని మరణం తీరని లోటు?

17-11-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో యువకుని మరణం తీరని లోటు. వారికి భార్య ఇద్దరు మొగ పిల్లలు ఉన్నారు.

 మరణ వార్త తెలుసుకుని గూడెం గ్రామానికి వచ్చి భౌతిక దేహాన్ని పూలమాల వేసి నివాళులు అర్పించిన వనపర్తి జిల్లా సాగర సంగం అధ్యక్షులు మోడల తిరుపతయ్య సాగర, చిన్నంబావి మండల అధ్యక్షులు జోగు రామచందర్ సాగర, గ్రామ అధ్యక్షులు గుమ్మడo విష్ణు సాగర్  , మరియు  శ్రీశైలం 98 జీఓ, నిర్వాసితులు.

 వనపర్తి అధ్యక్షులు మోడల తిరుపతయ్య సాగర్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇవ్వకులే అకాల మరణం చెందుతున్నారు దీనికి చాలా వరకు ఒత్తిడే  కారణం కావున కుటుంబ యజమానిపై ఒత్తిడి తగ్గించడం అంటే కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండటమే ఆని చెప్పారు. అదేవిధంగా పిల్లలకు విద్యాపరంగా, ఉద్యోగంపరంగా సంఘం తరఫున మేము భరోసాగా ఉంటామని పిల్లలకు ధైర్యం ఇచ్చాడు.

 అదేవిధంగా గ్రామ సాగర సంగం సభ్యులు  మరణించిన విష్ణు పిల్లలకి 5000 రూపాయలు   ఆర్థిక సహాయం చేశారు. గుమ్మడం శివసాగర్ % బాలీశ్వరయ్య 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.

విషాదం తరచుగా ఊహించని విధంగా సంభవిస్తుంది మరియు ఇటీవల చాలా మంది శ్రీశైలం నిర్వాసితులు గుండెపోటుతో కోల్పోవడం మనల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

చిన్నంబావి మండలం  గూడెం గ్రామానికి చెందిన సింగోటం విష్ణు సాగర్ నిన్న సాయంకాలం అకాల మరణం చెందారు హార్ట్ స్ట్రోక్ (గుండెపోటుతో) మృతి చెందారు ఈరోజు విషయం తెలుసుకొని ఉమ్మడి జిల్లాల శ్రీశైలం నిర్వాసితులు కమిటీ సభ్యులు గూడెం గ్రామానికి వెళ్లి ఆయన భౌతిక దేహాన్ని పూలమాల వేసి నివాళులు అరిపించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అధైర్యపడొద్దని అన్నారు...విష్ణు సాగర్ గారు శ్రీశైలం నిర్వాసితుల ఉద్యోగుల గురించి ఎప్పుడు వస్తాయని అడిగేవాడు ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు...విష్ణు సాగర్ గూడెం గ్రామానికి చెందిన ఒక నిర్వాసితుడు దాదాపు 40 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ, తీవ్ర నిరాశతో గుండెపోటుకు గురై అకాల మరణం చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ సందర్భంగా నిర్వాసితుడు గోవిందు మాట్లాడుతూ

నిర్వాసితులు ఇలా ఒక్కొక్కరుగా ఉద్యోగాల కోసం ఎదురు చూసి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తున్న చిన్న ఆశలూ సల్లగిల్లిపోతున్నాయి. గత కొన్నేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉద్యోగాలు రాకపోవడం వల్ల చాలామంది మానసిక ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణిస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ఆయన మరోమారు హెచ్చరిస్తూ“ఇలా జరుగడానికి ప్రభుత్వాలే కారణమని మేము భావిస్తున్నాము. మేము ఎవరూ పెద్దగా కోరుకోవడం లేదు… మా హక్కుగా ఉన్న జీవో 98ని అమలు చేసి మాకు  న్యాయం చేయాలి. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ నిర్వాసితులు మరణాలు పొందడం చాలా బాధాకరం. ఇకనైనా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి”అని విన్నవించారు.నిర్వాసితుల కుటుంబాల్లో అసహనం, ఆందోళన పెరుగుతున్న తరుణంలో జీవో 98ను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు తదుపరి *"డాగోజీ రావు మాట్లాడుతూ,* గూడెం గ్రామంలో నిర్వాసితుడు విష్ణు సాగర్ అకాల మరణం శ్రీశైలం నిర్వాసితుల్లో మరో విషాదం చోటుచేసుకుంది. గూడెం గ్రామానికి చెందిన నిర్వాసితుడు విష్ణు సాగర్ (పెబ్బేర్‌లో చిన్న పాలకేంద్రం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తు జీవనం కొనసాగిస్తున్నాడు) నిన్న రాత్రి 7:30 గంటలకు అకాల మరణం చెందాడు. గత రెండు రోజుల క్రిందట పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న విష్ణు సాగర్, "డాగోజీరావు అన్నా… ఇప్పటికైనా మనకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా?" అని ప్రశ్నించిన కొన్ని గంటలకే మరణించటం నిర్వాసితుల్లో తీవ్ర వేదనకు కారణమైంది.

 ఇదే గూడెం గ్రామంలో ఒక సంవత్సరం వ్యవధిలో శ్రీశైలం నిర్వహితులు నలుగురు మరణించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. వీరందరికీ ప్రభుత్వము ఉద్యోగము ఇవ్వలేదని   గుండెపోటుతో మరణించిన వారే  ఎన్నో ఆశలు పెట్టుకొని ఉద్యోగాలు రాక,

“నిర్వాసితులు ఎక్కడో ఒక గ్రామంలో నెలకు ఒకరు లేక ఇద్దరు ఇలా మరణిస్తున్నారు. ఎవరి పరిస్థితి ఏంటి, ఎవరికి ఏమైంది ప్రభుత్వం గానీ అధికారులు గానీ పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. విష్ణు సాగర్ మరణం మన బతుకుల్లో చినిగిపోయిన దారిలా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.98 జీవోపై ప్రభుత్వ హామీ “ఈ సమస్యలను మంత్రులు దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి గార్ల దృష్టికి ఎన్నిసార్లో తీసుకెళ్లాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జటపోల్, కొల్లాపూర్, పబ్బేర్ ఎన్నికల ముందు బహిరంగ సభల్లో ‘98 జీవో ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం’ అని స్పష్టంగా ప్రకటించారు. కానీ ఈ మధ్యకాలంలో జటప్రోలు గ్రామానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం 4 నెలలు గడిచినా అమలు కనిపించడం లేదు” అని చెప్పారు.“నిర్వాసితులకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు ”నిర్వాసితుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోందని తెలిపారు.

“ప్రభుత్వం వెంటనే స్పందించి కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేయాలి. ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికైనా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యపై స్పష్టత ఇవ్వాలి” అని అన్నారు.నిర్వాసితుల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతోంది అన్నారు విష్ణు సాగర్ మరణం నిర్వాసితుల్లో తీవ్రమైన మనస్తాపాన్ని కలిగించింది.

“ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి? ప్రభుత్వం ఇచ్చిన మాట ఎప్పుడే నెరవేరుతుంది?” అనే ప్రశ్నలు నిర్వాసితుల్లో పెల్లుబికుతున్నాయి.నిర్వాసితుల తరఫున నాయకులు ప్రభుత్వాన్ని వేడుకుంటూ

“ఇప్పటికైనా శ్రీశైలం నిర్వాసితుల దశను అర్థం చేసుకొని హామీ నెరవేర్చాలి. మరో ప్రాణం నిర్వాసితులు బలి కాక ముందే , మరో నిర్వాసిత కుటుంబానికి సంతోషాన్ని నింపాలని నిర్వాసితులు కోరుతున్నారు. తదుపరి నిర్వాసితుడు విష్ణు సాగర్ మరణం పట్ల సహచరులు వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహానికి సహచర మిత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విష్ణు సాగర్ అకాల మరణం నిర్వాసితుల మనోధైర్యంపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, సహచరులు ఒకరికొకరు ధైర్యం.చెప్పుకున్నారు.సహచరులు మాట్లాడుతూ

“మిత్రులారా, గుండె దైర్యంగా నిలబడండి. మన ఉద్యోగాలు తప్పకుండా పోరాటం ద్వారా సాధించుకుందాం ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యం పడవద్దు. 67 గ్రామాలకు చెందిన నిర్వాసితులు,నిరుద్యోగులు అందరూ ఒక్కటిగా నిలబడాలి”అని.పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో హామీలు ఇచ్చాయి, కానీ శ్రీశైలం నిర్వాసితులకు 30 ఏళ్లు గడిచిన ఉద్యోగాలు మాత్రం ఇప్పటికీ రాలేదు. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావాసి అయిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో నిర్వాసితుల్లో కొత్త ఆశలు కలిగాయి” అని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి జటపోలు సభలో ఇచ్చిన హామీకి ఇప్పటికే నాలుగు నెలలు అవుతున్నప్పటికీ అమలు దిశగా పెద్దగా పురోగతి కనిపించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావును విజ్ఞప్తి“మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు మా సమస్యల గురించి చైతన్యంతో ఉన్నారు. త్వరలో కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి, 99 కటాఫ్ డేట్‌ను తొలగించి, శ్రీశైలం నిర్వాసితులందరికీ ఉద్యోగాలు కల్పించే నిర్ణయం తీసుకుంటారని మా ఆశ” అని నిర్వాసితులు తెలిపారు.అలాగే అతి త్వరలోనే కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి నిర్వాసితులందరికీ గుండె ధైర్యం కల్పించగలరని జూపల్లి కృష్ణారావు ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం” అని అన్నారు ఈ కార్యక్రమంలో డాగోజి రావు, గోవిందు,  గుమ్మడం విష్ణు సాగర్, గూడెం రాఘవేంద్ర శెట్టి శాంతయ్య సింగ్ పెద్ద మారు శ్రీనివాసులు రంగస్వామి గుమ్మడం సుధాకర్ యాపర్ల దామోదర్ వెంకటం పల్లి నరసింహ కొత్తకోట కృష్ణ పెద్ద మారు ఆటో షాలు జహంగీర్ భాష కొప్పునూరు మద్దిలేటి అనిల్ కుమార్ వెల్లటూరు ఆనంద్ సురేష్ విష్ణు సాగర్ తదితరులు పాల్గొన్నారు

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State