ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

Nov 18, 2025 - 05:55
 0  516
ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

అత్యంత జాగ్రత్తగా ఉండాలి.. 

భార్గెట్లు ఏర్పాటు చేసుకోవాలి... 

 రోడ్డు భద్రత నియమాలు పాటించాలి... 

నాగారం 18 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

ప్రజల భద్రత, రక్షణలో భాగంగా సూర్యాపేట జిల్లా నాగారం మండల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గత రెండు రోజుల క్రితం సూర్యాపేట, జనగామ 365 బి రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కమలాకర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన స్థలాన్ని జిల్లా ఎస్పీ నరసింహ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించి, సిఐ నాగేశ్వరరావును ప్రమాదం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  నరసింహ మాట్లాడుతూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తనిఖీలు నిర్వహించే ప్రదేశంలో బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని, ఆ ప్రాంతంలో వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీసు సిబ్బంది రోడ్డు భద్రత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి