యాసంగి పంటకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే
తిరుమలగిరి 08 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
జనగాం జిల్లా కొడకండ్లలోని ఆర్‌డీఆర్ ఎస్సారెస్పీ స్టేజి-2 కల్వకు బయన్నవాగు రిజర్వాయర్ నుంచి 400 క్యూసెక్ నీటిని యాసంగి-2026 పంటలకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు నీటిని విడుదల చేశారు. రేపు 1600 క్యూసెక్కు ఈ నీటి విడుదల ద్వారా వందల ఎకరాల పంటలకు సాగునీటికి కష్టాలు తీరనున్నాయి అని అన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందుతుంది అని అన్నారు. బయన్న వాగు రిజర్వాయర్ నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయనున్నారు. ఏప్రిల్ వరకు నీటిని విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ..
రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, చివరి ఎకరం వరకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి విడుదలతో నియోజకవర్గ రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. నిన్న జనగాం సభలో సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ అసభ్య పదజాలం ఉపయోగించారని ఇది తగదన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలం ఉపయోగిస్తే కేటీఆర్ ను అడుగడగున వేంటాడుతామన్నారు. నీకంటే ఎక్కువగా మీ నాన్న మీద మాకు గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని కేటీఆర్ కాపాడుకోవాలని పేర్కొన్నారు. మేమే నోరు తెరిస్తే కేటీఆర్.. మీరు బయట తిరగలేరని, సీఎం రేవంత్ రెడ్డికి నైతిక విలువ ఉంది కాబట్టే జైల్లో ఉండాల్సిన మీరు బయట ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి నాగారం అర్వపల్లి కొడకండ్ల మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ యార్డ్ చైర్మన్లు పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు.