మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జూపల్లి కృష్ణారావు

Nov 19, 2025 - 19:17
Nov 19, 2025 - 19:31
 0  1
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జూపల్లి కృష్ణారావు

19-11-2025 తెలంగాణ వార్త ప్రతినిధి : చిన్నంబావి మండలం. చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన కొప్పునూరు గ్రామంలోమొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన కొప్పునూరు గ్రామంలోచిన్నంబావి : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం అయ్యవారిపల్లి, కొప్పునూర్ గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, “రైతులు దళారులను నమ్మి మోసపోకూడదు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ. 2400తో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు వెన్నుదండగా నిలుస్తోంది” అని తెలిపారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే పంటను విక్రయించి నష్టాల నుంచి బయటపడాలని సూచించారు.తర్వాత కొప్పునూర్ గ్రామంలోని పెద్దనట్టు భూమి వద్ద గ్రామ రైతుకమిటీ సభ్యులు, గ్రామ ప్రజలతో మంత్రి జూపల్లి సమావేశమై మాట్లాడారు. “116 ఎకరాల పెద్దనట్టు భూమి కొప్పునూర్ గ్రామ ప్రజల సమిష్టి ఆస్తే. ఎవరూ అపోహలు నమ్మవద్దు. కేసులను రెవెన్యూ అధికారుల నివేదికల ఆధారంగా కోర్టు కొట్టి వేసింది. భూమి హక్కు పూర్తిగా గ్రామానిదేనని కోర్టు తీర్పు ఇచ్చింది” అని మంత్రివర్యులు స్పష్టం చేశారు.అలాగే పెద్దనట్టులో రైతులకు ఉపయోగకరమైన వ్యవసాయ గోదాములను త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ రైతుకమిటీ సభ్యులు, ప్రజలపై ఉన్న కేసులను కోర్టు పరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సింగిల్ విండో చైర్మన్ బగ్గరి నరసింహా రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెబ్బేటి రామచంద్ర రెడ్డి, మండల సీనియర్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బీచ్‌పల్లి యాదవ్, మాజీ జెడ్పీటీసీ కృష్ణ ప్రసాద్ యాదవ్, శ్రీలత రెడ్డి, మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, వడ్డేమాన్ బీచ్చన్న,  సుధాకర్ నాయుడు,ఈఓ నాగరాజ్ సిబ్బంది తదితరులతో పాటు రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State