మైనర్ బాలికపై లైంగిక వేధింపులు కేసు నమోదు

Nov 5, 2025 - 16:39
 0  501
మైనర్ బాలికపై లైంగిక వేధింపులు కేసు నమోదు

  మోత్కూర్ 05 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పోలీస్ స్టేషన్లో మైనర్ బాలికపై వేధింపుల ఘటనపై బుధవారం నిందితున్ని రిమాండ్ కు తరలించారు. ఇన్స్పెక్టర్ శ్రీ సీ. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మోత్కూర్ మున్సిపాలిటీకి చెందిన 15 ఏళ్ల బాలికపై గాంధీనగర్ ప్రాంతానికి చెందిన రాంపాక మహేందర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా లైంగిక వేధింపులు చేస్తూ వచ్చాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు వలిగొండ రోడ్డులో చికెన్ షాప్‌లో పనిచేస్తూన్నాడు. తన ఇంట్లో ప్రాంతంలో నివసిస్తున్న వరుసకు చెల్లెలు అయిన మైనర్ బాలికను పదేపదే వేధిస్తున్నాడు. ఆ వేధింపులు భరించలేక బాలిక తల్లికి వివరించడంతో, బాధితురాలి తల్లి మంగళవారం మోత్కూర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసింది.ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి, బాలికను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉమెన్ ఆఫీసర్ సమక్షంలో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు.నిందితుడు రాంపాక మహేందర్‌ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకొని, రిమాండ్ కోసం చౌటుప్పల్ కోర్టుకు తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఇన్స్పెక్టర్ సీ. వెంకటేశ్వర్లు తెలిపారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి