మైత్రి ట్రాన్స క్లినిక్ ప్రారంభం.

Dec 5, 2024 - 20:05
Dec 5, 2024 - 20:17
 0  11
మైత్రి ట్రాన్స క్లినిక్ ప్రారంభం.

వికలాంగుల వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత  ప్రారంభం.

జోగులాంబ గద్వాల 5 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల.  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వికలాంగుల వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మరియు వైద్య ఆరోగ్యశాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రాంజెండర్ క్లినిక్ ను జిల్లా సంక్షేమ అధికారి సునంద, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వినోద్  గురువారం ప్రారంభించడం జరిగింది.
    జిల్లాలోని ట్రాన్స్ జెండర్ వ్యక్తుల కౌన్సిలింగ్, మానసిక ఆరోగ్యకరమైన సమస్యలు మరియు వైద్యం అందించడానికి ప్రత్యేకమైన క్లినికల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపినారు. అలాగే అనారోగ్య సమస్యలు, లింగ ఆధారిత  సేవలు, లైంగిక సంక్రమించే వ్యాధులకు చికిత్స, సామాజిక సేవ ఇతర క్లినికులు ల్యాబ్ సేవను అందుబాటులోకి రావడం జరుగుతుందని తెలిపారు.  క్లినిక్  ప్రతి గురువారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, ఇన్చార్జి సిడిపిఓ   వెంకటేశ్వరమ్మ, డీసీపీఓ నరసింహ,ప్రభుత్వ వైద్య ఆసుపత్రి ప్రిన్సిపాల్ డాక్టర్స్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333