వైద్య ఆరోగ్య సిబ్బందికి సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం.

Jun 8, 2024 - 19:05
 0  11
వైద్య ఆరోగ్య సిబ్బందికి సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం.

జోగులాంబ గద్వాల 8 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల.  తేదీ.08.6.2024 న పాత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది కె మధుసూదన్ రెడ్డి,  రామకృష్ణుడు, వరలక్ష్మి ,శివన్న ..  గద్వాల అర్బన్ ఆరోగ్యశాఖ వైద్య సిబ్బందికి సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు..  ప్రతి ఆశ కార్యకర్త ప్రతి శుక్రవారం డ్రైడే ప్రోగ్రాము రోజు ప్రతి ఇల్లు సర్వే చేసి అనుమానిత మలేరియా, డెంగ్యూ చికున్ గునియా, వైరల్ ఫీవర్, మొదలగు వ్యాధులను గుర్తించి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయాలని సూచించారు....  ప్రతి ఆశ డ్రైడే రోజు 100 ఇండ్లు సర్వే చేసి, సర్వే అనంతరం రిపోర్టును జిల్లా అధికారులకు పంపించాలని తెలిపారు. అదేవిధంగా, తమ పరిధిలోని ప్రజలకు సీజనల్ వ్యాధులు గురించి అవగాహన కల్పించాలని తెలిపారు, ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా ఉండేటట్లు చూసుకునే విధంగా కాలనీవాసులకు అవగాహన కలిగించాలని, అదేవిధంగా నీరు నిలిచిన ప్రాంతంలో, కుంటల్లో ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు.. వారానికి ఒకసారి నీటి నిల్వపాత్రలను, డ్రమ్ముల  లో, తొట్టిలలో , సిమెంట్ ట్యాంకుల లో, ప్లాస్టిక్ కంటైనర్ లో, ప్లాస్టిక్ బిందెలలో ,నీటిని పూర్తిగా తీసి, పారబోసి శుభ్రం చేయాలి ,పాకరా పట్టకుండా ఉండేటట్లు చూడాలని ప్రజలకు అవగాహన కలిగించాలి.. ఇంటి కిటికీలకు వెంటిలేటర్ పై, సన్నని జాలీలను బిగించి, దోమలు రాకుండా చూడాలని, చీకటి పడగానే ఇంట్లోకి దోమలు రాకుండా తలుపులు, కిటికీలు మూసుకోవాలని ప్రజలకు అవగాహన కలిగించాలి.. కచ్చితంగా ప్రజలందరూ దోమతెరలు వాడేటట్లు అవగాహన కలిగించాలని అదేవిధంగా ఇంటి పరిసరాలలో కాలువలలో చెత్తను వేయరాదని దీనివల్ల నీటి నిల్వలు పెరిగి దోమలు పెరుగుతాయని దీని వలన , మలేరియా డెంగు ,విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు   వాడి పడవేసిన ప్లాస్టిక్ గ్లాసులు కొబ్బరి బోండాలు చిన్న చిన్న కుండలు మరియు రోలు లాంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు..  ఇంటి పై కప్పు లపై ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు, మరియు సంపులు ,నీటి కూలర్స్ లలో నీరు నిల్వ ఉండకుండా, వారానికి ఒకసారి శుభ్రపరచుకోవాలని ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు.. ఈ అవగాహన కార్యక్రమానికి అర్బన్ ఆరోగ్య శాఖ వైద్య సిబ్బంది అయినటువంటి సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, కమ్యూనిటీ సూపర్వైజర్లు  ఆశాలు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333