ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి

Jan 12, 2026 - 20:23
 0  0
ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి
ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి

నెరడిగొండలో 16 మందికి రూ.4,45,500 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

బోథ్ నియోజకవర్గం న్యూస్ జనవరి 12 : నెరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఇచ్చొడ మండలం కామగిరి గ్రామానికి చెందిన కాతం రమణ రెడ్డికి రూ.60,000, తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన పెందూర్ రమకు రూ.40,500, బోథ్‌కు చెందిన బొడ్డు నవీన్‌కు రూ.21,000, బోథ్ మండలం కుచులపూర్ గ్రామానికి చెందిన వరగంటి గంగాధర్‌కు రూ.33,000, బోథ్‌కు చెందిన సాయిని వనితకు రూ.9,000, బోథ్ మండలం కన్గుట్ట గ్రామానికి చెందిన నల్వల రమేష్‌కు రూ.5,500, బోథ్‌కు చెందిన చంద్రమోహన్‌కు రూ.27,000, మంజరి నారాయణమ్మకు రూ.60,000, రుయ్యాడి గ్రామానికి చెందిన పెందూర్ రమకు రూ.54,000, నెరడిగొండ మండలం బొరిగాం గ్రామానికి చెందిన రాథోడ్ అరుణ్ జ్యోతికి రూ.21,000, బజార్ హత్నూర్ మండలం భూతాయి బి గ్రామానికి చెందిన రాథోడ్ ఉమ శ్రీకి రూ.17,000, చందునాయక్ తాండకు చెందిన చౌహన్ స్వప్నకు రూ.22,500, ఇచ్చొడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన షేక్ షకీల్‌కు రూ.17,500, నర్సాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ మహేందర్‌కు రూ.33,500, జామిడి గ్రామానికి చెందిన రాధ హత్మోడేకు రూ.15,000, తాంసి మండలం గిరిగావ్ గ్రామానికి చెందిన అదే శ్యామలకు రూ.9,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.


ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333