మానసిక వికాసానికి క్రీడలు అవసరం కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల

Jan 4, 2025 - 18:37
Jan 4, 2025 - 18:49
 0  8
మానసిక వికాసానికి క్రీడలు అవసరం కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ :- మానసిక వికాసానికి క్రీడలు అవసరం డిసెంబర్ 26, 27, 28, తేదీలలో హైదరాబాదులో జరిగిన సీ.ఎం . కప్ పోటీలలో కె. ఆర్ .ఆర్ .ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడ కు చెందిన విద్యార్థినులు వి. గౌరి (MPHW) రాష్ట్రస్థాయిలో 54.5 విభాగంలో (వెయిట్ లిఫ్టింగ్ లో) ద్వితీయ స్థానం పొంది రజక పథకం తో పాటుగా 15,000 రూపాయలు నగదు దక్కించుకుంది. ఇదే కళాశాలకు చెందిన జె. మహేశ్వరి (MPHW) తృతీయ బహుమతి కాంస్య పథకంతో పాటు పదివేల రూపాయల నగదు పొందింది. ఈ ఇరువురిని కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. రమణారెడ్డితో పాటుగా కళాశాల సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు మానసిక ఉల్లాసం, ఉత్తేజం, ఆరోగ్యం కోసం క్రీడలు కూడా ఎంతో అవసరమని ఈ క్రీడలు విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి, ఏకాగ్రతను పెంచుతాయని ఆయన గెలుపొందిన విద్యార్థినులను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జి.లక్ష్మయ్య, వేముల వెంకటేశ్వర్లు, జి.యాదగిరి,వి. బల భీమారావు, జి.నాగరాజు, పి.రాజేష్, జి. వెంకన్న, పి.తిరుమల,యస్.గోపికృష్ణ, ఎం .చంద్రశేఖర్, ఇ.నరసింహారెడ్డి,యస్. కె.ముస్తఫా, ఇ. సైదులు, యస్.కె.ఆరీఫ్,యన్.రాంబాబు, కె.శాంతయ్య, యస్.వెంకటాచారి,జ్యోతి,మమత డి.ఎస్ .రావులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State