మహిళల హక్కులే మానవ హక్కులు 

Mar 10, 2025 - 19:46
 0  2
మహిళల హక్కులే మానవ హక్కులు 

మహిళల హక్కులే మానవ హక్కులని చదువుల తల్లి సావిత్రిబాయి పూలే మహిళలకు ఆదర్శనీయులని నంది విజయలక్ష్మీ అన్నారు. స్థానిక కర్నూలు జిల్లా బి క్యాంపు నందలి యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో ఆధునిక భారతదేశ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మూడవ పట్టణ పోలీసు స్టేషను సి.ఐ.శేషయ్య గారు మౌర్య హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ కంచర్ల హరిప్రసాద్ గారు ప్రారంభించడం జరిగింది. మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, సి.ఐ. శేషయ్య గారు,మౌర్య హాస్పిటల్ డాక్టర్ కంచర్ల హరిప్రసాద్, ఖధీరుల్లా, ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు శేషఫణి, నక్కలమిట్ట శ్రీనివాసులు, భరత్ కుమార్ ఆచారి, ఆనంద్ బాబు,ఎరుకలి రాజు, యాట ఓబులేసు, రాంబాబు, పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సి.ఐ. శేషయ్య గారు మాట్లాడుతూ యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక పోరాటాలు చేస్తూనే సామాజిక సేవ చేయడం మంచి పరిణామం అని, ప్రజాసంఘాలు అందరూ కూడా మహిళా ఐక్య వేదికను ఆదర్శంగా తీసుకుని పోరాటాలతో పాటు సామాజిక సేవలో కూడా ముందు వుండాలని వారు తెలిపారు. డాక్టర్ కంచర్ల హరిప్రసాద్ గారు మాట్లాడుతూ కొంత మంది చరిత్రను వక్రీకరిస్తున్నారని నేటి యువత వాస్తవ చరిత్ర తెలుసుకోవాలని ఆయన అన్నారు. అనంతరం నంది విజయలక్ష్మి మాట్లాడుతూ పీడిత ప్రజల పక్షాన, ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని ఆమె అన్నారు. ఆమె దాదాపు 150 సంవత్సరాల క్రితం భయంకరమైన ప్లేగు వ్యాధి బారిన పడిన రోగులకు తన ఇంటిని హాస్పిటల్ కి మార్చి తానే స్వయంగా చికిత్స అందించి రోగులకు సేవ చేస్తూ అదే ఫ్లేగు వ్యాధితో మరణించిన గొప్ప మానవతావాది ఇతర సామాజిక సమస్యల గురించి మహిళలను చైతన్య పరచడానికి 1852 సంవత్సరములో  సేవామండలి అను మహిళా సంఘాన్ని స్థాపించి మహిళల హక్కులు, సాధికారత కోసం సావిత్రిబాయి పూలే గారు కృషి చేశారు. మహిళల హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించిన సావిత్రిబాయి పూలే  యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక కు ఆదర్శమని ఆమె అన్నారు. అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో పట్నం రాజేశ్వరి, పట్నం కాన్సీరామ్, ఖధీరుల్లా, పగడాల ఆనంద్ బాబు, భరత్ కుమార్ ఆచారి, కళ్యాణి,ఎరుకలి రాజు, కటికే భాను, తాటికొండ సుంకమ్మ, సరస్వతి, లిఖిత్, నరసింహ, ఇక్బాల్ భాష, షఫీవుల్లా,శ్రీకాంత్, హరికృష్ణ,రాము, చిరంజీవి,లోకేశ్వర రెడ్డి, మేఘనాథ ఆచారి, గల్లా రవికుమార్, తదితరులు రక్తదానం చేయడం జరిగింది. మహిళా ఐక్య వేదిక సభ్యులు మరియు విద్యార్థులు స్థానిక ప్రజలు ఉచిత శిబిరంలో పాల్గొని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా ఐక్య వేదిక సభ్యులందరూ పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333