డీఎంహెచ్వో కి వినతి పత్రం అందజేసిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ
జోగులాంబగద్వాల 23 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితిలో ఆర్ఎంపీ డాక్టర్స్ కి సరైన చికిత్స చేయడానికి రాక కొంతమంది పిల్లలు మరణించడం జరుగుతుంది దీనిని దృష్టిలో ఉంచుకొని అందరికీ (ఆర్ఎంపీ డాక్టర్లకు) తగిన విధంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి శిక్షణ అందించగలరని కోరడం జరిగింది. దేవిధంగా ప్రతి ఆదివారం రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో సంబంధిత డాక్టర్లు పేషెంట్లకు అందుబాటులో విధంగా చూడగలరని కోరడం జరిగింది. ప్రతి గవర్నమెంటు ఆఫీస్ నందు పి ఐ ఓ (PIO)ఏపీఐఓ (APIO) సంబంధిత ఆర్టిఏ అధికారులను నియమించాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ అధికారులు ఉన్నట్లయితే ప్రజలకు సమాచారం పూర్తిస్థాయిలో అందుతుంది లేనిచో సమాచారం అందకపోవడం వాటిని కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్లో ఉంచడం జరుగుతుంది. కావున ఇలాంటివి పునర్వృతం కాకుండా చూడాలని DMHO కి సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు మహేష్ గౌడ్ కోరడం జరిగింది. ముఖ్యంగా (సిటిజన్ చార్ట్) సమాచార హక్కు చట్టం 2005 బోర్డు ఏర్పాటు చేసేటప్పుడు సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లు ఉండేటట్లు ఏర్పాటు చేయగలరని చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పరశురాముడు,ఇన్చార్జి N రాజశేఖర్ కేటి దొడ్డి మండలం ప్రధాన కార్యదర్శి కృష్ణ ,జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు, మిత్రులు దాదావలి,జావిద్ ,థామస్ తదితరులు ఉన్నారు.