మానవ శరీరంలో అతి ముఖ్యమైనది రక్తం ఈజీఎం మురళీకృష్ణ

Nov 7, 2024 - 13:18
Nov 7, 2024 - 13:19
 0  7
మానవ శరీరంలో అతి ముఖ్యమైనది రక్తం ఈజీఎం మురళీకృష్ణ

తెలంగాణ వార్త ప్రతినిధి:- మానవ శరీరంలో అతి ముఖ్యమైనది రక్తం:ఈజీఎం మురళీకృష్ణ  కోదాడ,నవంబర్ 07: మానవ శరీరంలో అతి ముఖ్యమైనది రక్తమని దానిని కృత్రిమంగా ఎవరు తయారు చేయలేరని శ్రీ చైతన్య విద్యాసంస్థల ఈజిఎం మురళీకృష్ణ అన్నారు. స్థానిక శ్రీ చైతన్య పాఠశాల స్టార్ కిడ్స్ క్యాంపస్ లో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్ పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం సందర్భంగా బుధవారం రక్తదాన శిబిరాన్ని శ్రీ చైతన్య విద్యాసంస్థల సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు.ఈ రక్త దాన శిబిరంలో 52 మంది రక్తదానం చేయడం జరిగినది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ శరీరంలో అత్యంత విలువైనది రక్తమని ఆ రక్తాన్ని మరొకరికి దానం చేసి వారి ప్రాణాలను కాపాడటం అంటే ఎంతో గొప్ప సాహసం అని తెలిపారు.నేటి సమాజంలో సొంతవారికి సహాయం చేయడం లేదు అలాంటిది ఎవరో తెలియని వారికి ఆపదలో ఉన్నారంటే వారికి రక్తాన్ని ఇచ్చి వారికి ప్రాణదాతలుగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేశ్వర్లు,ప్రిన్సిపల్స్ గోపాలస్వామి,వీరారెడ్డి,ప్రశాంతి,ఉపాధ్యాయులు,ఉపాధ్యాయేతర సిబ్బంది,తల్లిదండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State