మానవత్వం చాటుకున్న ఎంపీడీవో ఆదర్శ్

Feb 20, 2026 - 20:14
 0  4
మానవత్వం చాటుకున్న ఎంపీడీవో ఆదర్శ్

మానవత్వం చాటిన ఎంపీడీవో ఆదర్శ్ గౌడ్

 20-02-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

చిన్నంబావి మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన టెక్నికల్ అసిస్టెంట్ ఈశ్వరయ్యకు ఎంపీడీవో ఆదర్శ్ గౌడ్ మానవత్వంతో స్పందించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

వివరాల ప్రకారం, కొల్లాపూర్ నుండి చిన్నంబావి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ ఈశ్వరయ్యకు మార్గమధ్యంలో కుక్కలు గుంపులుగా రోడ్డుపైకి రావడంతో ప్రమాదం జరిగింది. వాహనం అదుపుతప్పి పడిపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఎంపీడీవో ఆదర్శ్ గౌడ్ ఘటనాస్థలికి చేరుకుని ఈశ్వరయ్యను పరామర్శించారు. గాయాల తీవ్రతను గమనించిన ఆయన మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో తన సొంత కారులోనే వెంటనే పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘటన సమయంలో ఎంపీడీవో చూపిన మానవతా దృక్పథం, సత్వర స్పందన స్థానిక ప్రజలు, సిబ్బంది ప్రశంసలు అందుకుంది. అధికారులు ప్రజల పట్ల, సిబ్బందిపట్ల చూపాల్సిన బాధ్యతను ఆదర్శ్ గౌడ్ ఆచరణలో చూపారని మండల ప్రజలు అభినందిస్తున్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State