అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఆహ్వాన కార్యక్రమం

మరిపెడ 25 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలొని కుడియా తండా నందు అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ శ్రీలకు ఆహ్వాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ కుమ్మరికుంట్ల జ్యోతి ఘనంగా నిర్వహించారు. గర్భిణి తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పౌష్టికాహారాల గురించి వారికి వివరించారు.జూన్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు అంగన్వాడి కేంద్రంలో జరిగిన ప్రీస్కూల్ పిల్లల కార్యక్రమాలన్నీ గర్భిణీ తల్లుల మహిళలందరికీ వివరించారు అనంతరం అంగన్వాడి కేంద్రాల ద్వారా ఎల్కేజీ యూకేజీ నర్సరీ వరకు ఇక్కడే క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ రుచికరమైన భోజనాన్ని అందిస్తూ పిల్లలు ఆరోగ్య పరిస్థితినీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ బరువు ఎత్తుల ద్వారా తెలుసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా పిల్లలు ఉండుటకు ఆటలు పాటలు కథలు చెప్పుతు ప్రైమరీ పాఠశాలకు సంసిద్ధులుగా తయారు చేస్తున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో తల్లులు మౌనిక,సంగీత, శ్రీదేవి,అంగన్వా టీచర్ కుమ్మరి కుంట్ల జ్యోతి,ఆయా జాటోతు లక్ష్మి,తల్లులు,పిల్లలు పాల్గొన్నారు.