మాజీ డిఎస్పి నళిని ని కలిసిన
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
*సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డిఎస్పి ని కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు*
భువనగిరి 22 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సోమవారం రోజు మాజీ డిఎస్పి నళిని ఇంటికి వెళ్లారు.ఆమె తెలంగాణ ఉద్యమ సమయంలోని డి.ఎస్.పి ఉద్యోగానికి రాజీనామా చేసిరు.మటాయిడ్ అర్థరైటిస్,చికెన్ గున్యా,టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న,మాజీ డిఎస్పి నళిని జిల్లా కలెక్టర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను,ఆమె యొక్క అనారోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తన ఆరోగ్యం గురించి వాకబ్ చేయగా,తాను ఏన్నో రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నానని తెలిపారు.ప్రభుత్వం సహాయం చేయడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని నళినికి వివరించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు.అల్లోపతి మందులు పడకపోవడంతో ఆయుర్వేద మందులను వాడటం వల్ల ఉపశమనం ఉందని కలెక్టర్ కు తెలిపారు.ఆరోగ్య పరిస్థితులు బాగుండాలని,ప్రభుత్వం నుండి వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.సర్వీస్ ఇష్యులు ఏమి ఉన్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కారం ఉంటుందని కలెక్టర్ కలెక్టర్ హనుమంతరావుఅన్నారు.