మహిళ లేనిదే సృష్టి లేదు

Mar 7, 2024 - 20:58
Mar 7, 2024 - 21:12
 0  10
మహిళ లేనిదే సృష్టి లేదు

సూర్యాపేట : మహిళ లేనిదే సృష్టి లేదని ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ జి అరుణ, యూనియన్ ప్రెసిడెంట్ ఎల్ మోహన్ సింగ్ లు అన్నారు.  గురువారం జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని కేక్ కట్ చేసి పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టిలో మహిళ పాత్ర ప్రముఖ మైందన్నారు . మహిళలు ప్రతి రంగంలో రాణించి  పురుషులతో సమానంగా విధులు నిర్వహించాలన్నారు. అనంతరం ఈనెల 13న జరిగే ఎల్ఐసి మెగా బిజినెస్ డే ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ డి ప్రభాకర్, ఉమెన్ సబ్ కమిటీ మెంబర్ ఎస్ సువర్ణ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333