ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలి
సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్
సూర్యాపేటటౌన్ మార్చి 7:- రాష్ట్ర ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎల్ ఆర్ ఎస్ కోసం అప్లికేషన్ చేసుకున్న వారికి మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలని ప్రభుత్వం కట్ ఆఫ్ డేటు నిర్ణయించడం సరికాదన్నారు.
ఒక్కొసారి సర్వర్లు కూడా సరిగా పని చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని నియమించి ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనీ అన్నారు. ఎల్ ఆర్ ఎస్ లో 2020సంవత్సరంలో ఫ్లాట్లకు 10000 రూపాయలు , వ్యవసాయ అగ్రికల్చర్ వెంచర్లకు ప్లాట్లకు గతంలో మీసేవ ద్వారా పదివేల రూపాయలు కట్టి ఉన్నా కానీ 10,000 కట్టింది ఎల్ ఆర్ ఎస్ తీసుకోవట్లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఎల్ ఆర్ ఎస్ కట్టిన ప్రతి ఒక్కరి కి రెగ్యులర్ చేసి ప్రొసీడింగ్స్గు లెటర్స్ ఇవ్వడంతో పాటు 2021- 22 లో కూడా అనధికార లేఔట్లకు ప్లాట్లకు దరఖాస్తు చేసుకునేందుకు కొత్తవారికి కూడా ఎల్ అర్ ఎస్ అప్లికేషన్ ఫీజు కట్టుకునేందుకు క్రమబద్ధకరించే అప్లికేషన్లకు నూతన మార్గదర్శకాలు విడుదల చేయాలనీ విజ్ఞప్తి చేశారు . ఒక ఎకరం లోపు నాలా కన్వర్షన్ కింద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు మార్గదర్శకాలు విడుదల చేయాలనీ అన్నారు.
మున్సిపాలిటీ,గ్రామ పంచాయతీ కార్యాలయంలో గత పది, పదిహేను సంవత్సరాల నుంచి సాదా బైనామా కాగితాల ద్వారా కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించుకున్న వారికి అధికారులు డబ్బులు తీసుకొని ఇంటి పన్ను రసీదు ఇచ్చి ఇంటి నెంబర్ కూడా ఇచ్చి కేటాయించి ఇప్పుడు రికార్డ్లో లేదని చెబుతున్నారనీ ఒకసారి ఇచ్చిన నెంబర్ మళ్ళీ ఇంటి పన్ను కట్టుకొని అదే నెంబరు ప్రజలకు ఇవ్వాలనీ కోరారు. అధికారులు రికార్డులు రాసుకోకుండా ఆన్లైన్ చేయకుండా వేల రూపాయలు ప్రజల సొమ్ము కాజేసిన మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ అధికారులపై కలెక్టర్ చర్య తీసుకోవాలనీ అన్నారు. అదే ఇంటి నెంబర్ను ఇవ్వమని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన అధికారులు ప్రజెంట్ ఓల్డర్ అని గతంలో ఇంటి నెంబర్ ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఇంటి నెంబరు ఇవ్వకుండా పేరు లేకుండా ఇంటి నెంబర్ ఇస్తున్నారు అలా ఇవ్వడం వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నదనీ తమ బిడ్డల భవిష్యత్తు అందాకారంగా అవుతున్నదనీ అన్నారు.
ఆయన వెంట..... సూర్యాపేట పట్టణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారు దేవత కిషన్ నాయక్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు అయితే గాని మల్లయ్య గౌడ్ ఎలుగురి రమా కిరణ్ గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ బొమ్మగాని ఎంకన్న గౌడ్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.