మల్దకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను ఆకస్మిక తనిఖీ. డీఈవో విజయలక్ష్మి
జోగులాంబ గద్వాల 4 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్ జిల్లా విధ్యాశాఖాధికారి విజయలక్ష్మి మల్దకల్ మండలము లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్దకల్ ను ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. పాఠశాలలో అన్ని తరగతి గదులను ,సైన్స్ ప్రయోగ శాల , కంప్యూటర్ గది మరియు వంట గదులను తనిఖీ చేయడము జరిగింది. మధ్యాహ్న భోజనమును పరిశీలించడం జరిగింది.ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల హాజరును పరిశీలించి.ఈ విద్య సంవత్సరము పదవ తరగతి లో మంచి ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా సూచించడమైనది. తరువాత. కే జి బి వి మల్దకల్ సందర్శించి ఉపాధ్యాయుల హాజరు ను పరిశీలించడం జరిగింది. కే జి బి వి లో స్టోర్ రూమ్ లోని అన్ని వస్తువుల నాణ్యతను మరియు స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించడం జరిగింది.వీరి వెంట జిల్లా సెక్టోరల్ అధికారి శ్రీ అంపయ్య మండల విధ్యాధికారి శ్రీ సురేష్ మరియు ఇతర ఉపాధ్యాయులు హాజరు కావడము జరిగింది. తదనంతరం మల్దకల్ దేవాలయం స్వయంభు వెంకటేశ్వర స్వామి నీ దర్శించడం జరిగింది.