మద్యం డ్రగ్స్ మత్తుకు దూరంగా ఉండాలి. ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్

Aug 6, 2025 - 20:53
 0  0
మద్యం   డ్రగ్స్ మత్తుకు దూరంగా ఉండాలి. ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ .. మండల పరిధిలోని గట్టికల్ లో మత్తు పదార్థాలు ,డ్రగ్స్ నిర్మూలన పై పోలీస్ ప్రజా బరోసా ద్వారాబుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు,డ్రగ్స్ కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నవిన్నవయ్యాయని డ్రగ్స్ వలన విద్యార్థులు పౌరులు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు అన్నారు. గట్టికల్లు గ్రామంలో ఐకమత్యంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేసుకున్న గ్రామస్తులను అభినందించారు. మన సమాజం నుండి మద్యం గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను వెలివేయాలని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ డ్రగ్స్ అనేవి మన పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ ఎస్ ఐ జానికి రాములు, హెడ్ కానిస్టేబుల్ గురు లింగం, వెంకటేశ్వర్లు సిబ్బంది లింగా నాయక్ గ్రామస్తులు పాల్గొన్నారు.