మత్తు కు బానిస కావద్దు ఏఎన్ఎం ధనమ్మ

Nov 18, 2025 - 12:22
 0  471
మత్తు కు బానిస కావద్దు ఏఎన్ఎం ధనమ్మ

మత్తు పదార్థాల వల్ల భవిష్యత్తు అంధకారం...! 

దేశ భవిష్యత్తును కృంగదీసే మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలిద్దాం...! 

గుట్కా తంబాకు మానేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి...! 

 

తిరుమలగిరి 18 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:

 మత్తుకు అలవాటు పడి భవిష్యత్తును విచ్చిన్నం చేసుకుంటున్నారని, సమాజం లోని ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలను వాడకుండా ఉండాలని కాలనీ వాసుల తో ప్రతిజ్ఞ చేయించి అలాంటి వారిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఏఎన్ఎం ధనమ్మ పిలుపునిచ్చారు. తిరుమలగిరి మండల కేంద్రంలోని మూడవ వార్డులో మత్తు పదార్థాల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమాజంలో చిన్న వయసు నుండి మొదలుకొని పెద్ద వయసు వారు వరకు ముఖ్యంగా యువత మత్తుకు అలవాటు పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని, పలువురు మత్తు పదార్థాలకు అలవాటు పడి, డబ్బుల కోసం నేరాలు హత్యలకు సైతం పాల్పడుతూ, మంచి భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా తమ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉంటారని కలలుగన్న వారి కలలను కల్లలుగా చేస్తున్నారని, మత్తు పదార్థాల సేవనం వల్ల మైండ్ తో పాటు, విచక్షణా శక్తిని కోల్పోతున్నారని, సామాజిక ,మానసిక, శారీరక, అనారోగ్యాలు, ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతూ సమాజం నుండి దూరమవుతున్నారన్నారు. ప్రాణాంతకమైన మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు 'నో' చెప్పేలా సహకరించి యువత బంగారు భవిష్యత్తు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ అధ్యక్షురాలు గోపగాని విజయ ,కొమ్ము విజయ మరియు కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి