భోగి రోజు ప్రారంభమయ్యే కుంభమేళా శివరాత్రి తో పూర్తవుతుంది..

Jan 13, 2025 - 15:38
Jan 13, 2025 - 16:09
 0  27
భోగి రోజు ప్రారంభమయ్యే కుంభమేళా శివరాత్రి తో పూర్తవుతుంది..

తెలంగాణ వార్త ప్రతినిధి :- భోగి రోజు ప్రారంభమయ్యే కుంభమేళా.. శివరాత్రితో పూర్తవుతుంది.దీని వెనుక పురాణాల్లో ఓ కథనం ఉంది. అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు దేవతలు-రాక్షసులు. అప్పుడు వెలువడిన అమృత కలశాన్ని జయంతుడు అనే కాకి నోట కరుచుకుని భూమి చుట్టూ తిరుగుతుంది..ఈ జయంతుడు అనే కాకి ఎవరో కాదు ఇంద్రుడి కొడుకు. గౌతమ మహర్షి శాప ప్రభావంతో కాకిగా మారి చివరకు రాముడి చేతిలో శాపవిమోచనం పొందుతాడు. అహల్యపై మనసు పడిన తండ్రి కాంక్ష తీరాలంటే...గౌతముడిని బయటకు పంపించాలని ఆలోచిస్తాడు జయంతుడు. అందుకే కాకి రూపంలో గౌతమ మహర్షి ఇంటిముందుకు వెళ్లి అరుస్తాడు. కాకి అరుపు విని నదీస్నానానికి బయలుదేరుతాడు గౌతముడు. ఆ తర్వాత కాకి రూపంలో వచ్చింది జయంతుడు అని తెలిసి..కాకిగానే మారిపో అని శపించాడు.ఈ జయంతుడు అమృత కలశాన్ని తీసుకుని 12 రోజుల పాటూ భూమి చుట్టూ తిరిగాడు రాక్షసులకు అందకుండా. మానవులకు ఏడాది కాలం అంటే దేవతలకు ఓ రోజుతో సమానం. దక్షిణానయం రాత్రి సమయం..ఉత్తరాయణం పగటి సమయం అని అందుకే చెబుతారు. ఈ లెక్కన దేవతలకు 12 రోజులు అంటే మానవులకు 12 సంవత్సరాలు అని అర్థం. అందుకే 12 ఏళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. జయంతుడు అమృత కలశం తీసుకుని భూమిమొత్తం తిరిగినప్పుడు ఈ నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు ఎందుకంటే.. ఆ అమృత కలశం నుంచి నాలుగు చుక్కలు ఈ నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి. అందుకే ఇవి అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా చెబుతారు పండితులు. అమృతం పడిన ఆ నాలుగు ప్రదేశాలో ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్....అందుకే వీటిని వైకుంఠంతో సమానమైన ప్రదేశాలు అంటారు. గంగ, యమున నదుల సంగమ ప్రదేశంలో సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. ఈత్రివేణి సంగమంలో కుంభమేళా సమయంలో రాజస్నానం ఆచరిస్తారు.

@ సాధారణ కుంభ మేళా నాలుగేళ్లకోసారి జరుగుతుంది

@ ఆరేళ్లకోసారి జరిగేదాన్ని అర్థకుంభమేళా అంటారు. ఇది హరిద్వారా లేదా ప్రయాగలో జరుగుతుంది.

@ పూర్ణ కుంభమేళా అనేది పన్నెండేళ్లకోసారి జరుగుతుంది. ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లో జరుగుతుంది

@ 12 పూర్ణ కుంభమేళాలు పూర్తిచేసిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఓసారి అలహాబాద్ లో మహాకుంభమేళా నిర్వహిస్తారు.

@ ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అని అంటున్నారు. వాస్తవానికి మహా కుంభమేళా చూసే అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది. 

మహాకుంభమేళా 2025 లో రాజస్నానం ఆచరించేందుకు ప్రత్యేక తిథులివే..

2025 జనవరి 13 పుష్య పూర్ణిమ కుంభమేళాల్లో చేసే స్నానాల్లో అత్యంత పవిత్రమైన రాజ స్నానం ఈ రోజు చేస్తారు 

రెండో రాజ స్నానం- 2025 జనవరి 14 మకర సంక్రాంతి  

మూడో రాజ స్నానం - 2025 జనవరి 29 మౌని అమావాస్య 

నాలుగో రాజ స్నానం - 2025 ఫిబ్రవరి 3 వసంత పంచమి 

ఐదో రాజ స్నానం - 2025 ఫిబ్రవరి 4- అచల నవమి 

ఆరో రాజ స్నానం - 2025 ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ 

చివరి రాజ స్నానం - 2025 ఫిబ్రవరి 26 మహా శివరాత్రి 

@ ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అని అంటున్నారు. వాస్తవానికి మహా కుంభమేళా చూసే అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది.  

**సేకరణ: అంతర్జాల సమాచారం నుంచి.**

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State