విలాస (విల్లా )జీవితాలు
విలాస జీవితాలు
భోగభాగ్యలు అనుభవిస్తు
డబ్బుకు కొదవలేదు
సౌకర్యాలకు కొరతరాదు
ఇంటిముందు వాహనాలు
వాటిని నడిపే చోదకులు
లోపల నౌకర్లు
కాపలాగా గురకాలు (సెక్యూరిటీ )
భద్రత్తగా సి. సి. కెమెరాలు
పెంపుడు కుక్కలు
కరెంటు ఫెనిచింగులు
పోలీసు పెట్రోలింగులు
మనిషి మనిషికొక గది
ఎవరి కారు, బండి వారిది
ఎవరి వ్యాపకం, వ్యాపారం
ఉద్యోగం, రాజకీయం వారిది
కలిసేది, కలిసి తినేది తక్కువ
ఫోన్లలో మాట్లాడేది ఎక్కువ
ఎక్కడెక్కడో పోతారు
ఎప్పుడో వచ్చి పడుకుంటారు
ఫంక్షనలలో కలుసుకుంటారు
పలకరించుకుంటారు
కాలక్షేపం చేస్తారు
సరదాగా గడుపుతారు
సంపాదనమీద మక్కువ
కూడబెట్టాలన్న కోరికఉంటుంది
పేరు ప్రతిష్టలకొరకు ఆరాటపడతారు
పేదరికాన్ని తట్టుకోలేక పోతారు
వారికి సమస్యలుంటాయి
సంఘర్షణ ఉంటుంది
బయటకు చెప్పుకోలేరు కాని,
చూసేవారికి మాత్రం విలాస మనిపిస్తుంది
చూడముచ్చటగా ఉంటుంది.
రచన.
కడెం. ధనంజయ
చిత్తలూర్