భారత రాజ్యాంగ రక్షణే అంబేద్కర్ కు నిజమైన నివాళి
తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్_నేషనల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్
హైదరాబాద్ ప్రతినిధి:- భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న మతోన్మాద పాలకుల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే బాబా సాహెబ్ అంబేద్కర్ నిజమైన నివాళి అని తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్__ నేషనల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు టైగర్ నవాబ్ పేర్కొన్నారు.
ఆదివారం కోరుట్లలో మహానీయుడు అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన 133 వ జయంతోత్సవాలలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ తో కలిసి పాల్గొన్న టైగర్ నవాబ్ మాట్లాడుతూ దేశాన్ని చిన్నబిన్నం చేస్తు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటు వ్యక్తులకు ధారదత్తం చేస్తు రాజ్యాంగాన్ని సమూలంగా నాశనము చేయాలని ఒంటేద్దు పోకడలో వ్యవరిస్తున్న మనువాదుల కుట్రలను బద్దలు కొట్టాలని టైగర్ నవాబ్ పిలుపునిచ్చారు... ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వడి నర్సింగ్ రావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్.. అలాగే వారితో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.. ప్రజా ప్రతినిధులు_బీఆర్ఎస్ కౌన్సిలర్లు_మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.పోలీస్ నజర్ న్యూస్ సీఈఓ షేక్ రహీమ్ అలాగే స్థానిక ప్రెస్ క్లబ్ మరియు ప్రెస్ భవన్ మీడియా మిత్రులు పాల్గొన్నారు