భారీ రోడ్డు ప్రమాదాన్ని తప్పించిన ఎఫ్ఎస్టి సభ్యులు
తిరుమలగిరి 03 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల పరిధిలోని వెలిశాల x రోడ్ వద్ద లారీ నెంబర్ Ap-39-WH-7218 తునము కృష్ణ లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు కోదాడ.అతని యొక్క సంబంధించిన. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు సిరిసిల్ల నుండి తొర్రూర్ రైస్ మిల్లుకు వడ్ల లారీ లోడుతో వస్తుండగా అకస్మాత్తుగా రోడ్డు మీద 40 బస్తాలు పడిపోతున్నా వాటిని గమనించిన అక్కడే ఉన్న ఎలక్షన్ డ్యూటీ ఎఫ్ఎస్టి సభ్యులు త్వరగా స్పందించి 1/2 కిలోమీటర్ దూరం నుండి పడిన వడ్ల బస్తాలను చాకచక్యంగా ప్రక్కకు పెట్టి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్పందించినందుకు అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న సిబ్బందిని పనిని చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.పాల్గొన్నవారు: నయాబ్ తాసిల్దార్ జానీ మహ్మద్,,హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, పోలీస్ కానిస్టేబుల్ మురారి సైదులు, ఫోటోగ్రాఫర్ మరియు డ్రైవర్ పాల్గొన్నారు.....