గ్రామ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మార్లబీడు గ్రామ సర్పంచ్
జోగులాంబ గద్వాల 6మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. గ్రామ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మార్లభీడు గ్రామ సర్పంచ్ ఆనంద్ తను సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఏదో పని చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. గ్రామంలో ఉన్న పారిశుద్ద్య పనులపై దృష్టి సారించారు గ్రామస్తులు అంటూ వ్యాధుల బారిన పడకుండా గ్రామంలో ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామంలో ఉన్న అంతర్గత రోడ్లను బాగు చేసే పనిలో ఉన్నారు. రోడ్లపై చెత్తాచెదారం లేకుండా పారిశుద్ధ్య కార్మికులతో డ్రైనేజ్ కాలువలను బాగు చేయిస్తున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు రాకపోయినప్పటికీ తన సొంత డబ్బుతో గ్రామంలో ఉన్న అంతర్గత రోడ్లకు, మరమ్మత్తులు, మట్టి రోడ్లు వేయిస్తున్నారు. మునిపెన్నడు లేని విధంగా ఈ సర్పంచ్ చేయని విధంగా అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి ఎవరికి కష్టం రాకుండా చూడడమే నా ముందున్న కర్తవ్యం అంటూ... నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించిన మా గ్రామస్తుల రుణం తీసుకోవడం నా ప్రథమ కర్తవ్యం అంటున్నారు గ్రామ సర్పంచ్ ఆనంద్.