భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త
సావిత్రిబాయి పూలే ఎక్సలెన్స్ అవార్డు 2025 కొరకు దరఖాస్తులు ఆహ్వానం.
భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘసంస్కర్త చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సాంస్కృతిక కళ సాహిత్య సామాజిక సేవా సంస్థలు హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ ప్రధాన కార్యదర్శి దైద వెంకన్న అనిత ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లి నందు త్యాగరాయ గాన సభలో తేదీ జనవరి 3 2025న "విద్యా, వైద్యం ,సామాజిక సేవ ,జర్నలిస్టులు, పర్యావరణం, ఉద్యోగులు ,సాహిత్యం, వ్యవసా యం, ఆధ్యాత్మికం, దైవ సేవకులు, మిమిక్రీ ఆర్టిస్టులు, చిత్రలేఖనం, సినీ టీవీ ఆర్టిస్టులు, విశ్రాంత ఉద్యోగులు, రాజకీయం, వ్యాపారం, బెస్ట్ కపుల్స్ తెలంగాణ ఐకాన్ ,కళా రంగాలలో విశిష్ట సేవలు అందించిన సేవా మూర్తులకు సావిత్రిబాయి పూలే ఎక్సలెన్స్ అవార్డు 2025" ను ప్రముఖుల చేతుల మీదుగా ప్రధానం చేయబడును. ఈ అవార్డు కొరకు ఆసక్తి కలవారు 27 డిసెంబరు 2024 వరకు మీ యొక్క బయోడేటా ను పంపించగలరు మీరు చేసిన సేవ కార్యక్రమాలు నాలుగు పేపర్ కటింగ్స్ ఒక పాస్ ఫోటో ఈ క్రింది వాట్సాప్ నెంబర్ కు పంపించగలరు 9666116850.
అవార్డుల ఎంపిక జాబితా 30 డిసెంబరు 2024న విడుదల చేయబడును
నోట్...1. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే
అనే అంశంపై "కవిసమ్మేళనం" నిర్వహించబడును.
2.కొద్దిమందికి మాత్రమే
" స్వర్ణ కంకణం" బహుకరించబడును.
3. సాంస్కృతిక (ఆట పాట) కార్యక్రమాలు నిర్వహించబడును
ఈ కార్యక్రమంలో హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ కోశాధికారి సంయుక్త కార్యదర్శి పిడమర్తి ప్రవీణ్ అశోక రాణి ఉపాధ్యక్షులు కత్తుల వెంకన్న ప్రోగ్రాం ఆర్గనైజర్స్ పి మల్లేష్ హోప్ మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ నీరుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు
ప్రధాన కార్యదర్శి
దైద వెంకన్న అనిత.
9666116850.