సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ నాయకులు
అడ్డగూడూరు 01 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:–
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌల్లరామారంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రోజు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు.రేవంత్ రెడ్డికి పరిపాలన సాధ్యం కాక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పెట్టిన కేసీఆర్ ను విమర్శంచడమే పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సర్పంచ్ రేణుక కిరణ్, ఉప్ప సర్పంచ్ తోట క్రిష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.