బోగస్ పెన్షన్లు ఏరువేతకు రంగం సిద్ధం ఏపీ ప్రభుత్వం

Dec 28, 2024 - 17:02
Dec 28, 2024 - 17:18
 0  31
బోగస్ పెన్షన్లు ఏరువేతకు రంగం సిద్ధం ఏపీ ప్రభుత్వం

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి :- బోగస్ ఫించన్ల ఏరివేతకు రంగం సిద్ధం ఏపీలో నకిలీ వైకల్య ధ్రువపత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి 3నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈపరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్/ మే వరకు కొనసాగనున్న నేపథ్యంలో కొత్తవారికి వైకల్య ధ్రువపత్రాలజారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. వైకల్య సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State