చురుగ్గా జరుగుతున్న నదిపై పంట్లు అమర్చే పనులు..
భక్తులు గోదావరి నది దాటేందుకు కాలినడక రహదారి...
పోలవరం తెలంగాణ వార్త ప్రతినిధి మార్చి 2 :- మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా పోలవరం మండలం పట్టిసీమ గ్రామం వద్ద గోదావరి నది మధ్యలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత విరేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు గోదావరి నది దాటేందుకు పంటే లతో ఏర్పాటు చేసే కాలి నడక రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాలు మార్చి 8 వ తేదీన జరగనున్నాయి.ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పందుర్లు పనులు,ర్యాంప్ పనులు చెయ్యడం జరిగిందని నది పై భక్తులు నడిచి వెళ్ళేందుకు కాలి నడక రహదారి కోసం పటిష్టంగా పంట్లు అమరిక పనులు జరుగుతున్నాయని ఉత్సవాలకు రెండు రోజులు ముందుగానే పూర్తి అయ్యేలా పనులు చేస్తున్నట్లు పెర్రీ కాంట్రాక్టర్ మైగాపుల సత్యనారాయణ అన్నారు. ఈ పంట్లుపై నడుచుకుంటూ సుమారు రెండు లక్షల మంది భక్తులు వెళ్లి మహాశివరాత్రి రోజు పరమశివుడు ని దర్శించుకునే అవకాశం ఉంది.. అందుకు తగిన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు..