బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి టిఆర్పి మండల అధ్యక్షులు బొల్లె సైదులు

Jan 7, 2026 - 21:27
Jan 8, 2026 - 16:05
 0  2
బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి   టిఆర్పి మండల అధ్యక్షులు బొల్లె సైదులు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి టిఆర్పి మండల అధ్యక్షులు బొల్లె సైదులు ఆత్మకూర్ ఎస్....ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల (బీసీ) సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బుధవారం తహాసిల్దార్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బొల్లె సైదులు మాట్లాడుతూ బీసీలలో అన్ని కులాలకు న్యాయం జరగాలంటే కచ్చితంగా బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్పి మండల ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ ఉప్పల మల్లయ్య యాదవ్, జిల్లా యూత్ అధ్యక్షులు కోల కర్ణాకర్ ముదిరాజ్, రాజ్యాధికార పార్టీ నాయకులు వీరబోయిన గంగయ్య యాదవ్, బోనగిరి మహేష్ కుషనపల్లి వెంకన్న, అల్లి శ్రీకాంత్, సంతోష్, నవీన్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.