బిక్కేరు వాగు పై బ్రిడ్జి నిర్మించాలి ఎమ్మెల్యే మందుల సామెల్

Dec 23, 2025 - 20:35
 0  266
బిక్కేరు వాగు పై బ్రిడ్జి నిర్మించాలి ఎమ్మెల్యే మందుల సామెల్

  తిరుమలగిరి 24 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

 మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ....

బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలి.... 

తుంగతుర్తి అభివృద్ధికి తోడుంటా :మంత్రి

సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామం నుండి యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామాలను మధ్య ఉన్న బిక్కేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం అత్యవసరమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్ సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే సామెల్, సంబంధిత ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను వివరించారు. వర్షాకాలం వచ్చేసరికి వాగు ప్రవాహం పెరిగిపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి నెలకొంటుందని, సాధారణ రోజుల్లో కూడా ప్రజలు వాగులోంచే ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు. అందుకే బ్రిడ్జి అత్యవసరమని, నిర్మాణానికి తక్షణ నిధుల మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు.బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల మధ్య రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.వినతి పత్రాన్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపాదనను సానుకూలంగా పరిగణించి తగిన చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే మందుల సామెల్ విలేకరులకు తెలిపారు.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి