అగ్గిపాలైన పత్తి ఇద్దరిపై కేసు..రిమాండ్ కు తరలింపు ఎస్సై వెంకట్ రెడ్డి

Dec 23, 2025 - 19:54
 0  319
అగ్గిపాలైన పత్తి ఇద్దరిపై కేసు..రిమాండ్ కు తరలింపు ఎస్సై వెంకట్ రెడ్డి
అగ్గిపాలైన పత్తి ఇద్దరిపై కేసు..రిమాండ్ కు తరలింపు ఎస్సై వెంకట్ రెడ్డి

అడ్డగూడూరు 23 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ర్యాలీలో క్రాకర్స్,టపాసులు కాలుస్తుండగా సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో కోటమర్తి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పాశం విష్ణువర్ధన్ ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తుండగా అట్టి ర్యాలీలో పాల్గొన్న మనిపెద్ది సురేందర్, మనిపెద్ది మచ్చగిరి అనే వ్యక్తులు ర్యాలీలో క్రాకర్స్, టపాకాయలు పేల్చడంతో అవి గూడ సోమయ్య అనే వ్యక్తి ఇంట్లోని నిలువచేసిన పత్తిలో పడి సుమారుగా నాలుగు క్వింటాల పత్తి కాలి బూడిదై.ఇట్టి విషయంపై గూడ సోమయ్య యొక్క ఫిర్యాదు మేరకు పైన తెలిపిన వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్ నందు మంగళవారం రోజు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించిన ఎస్సై వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333